డిసెంబర్ లోనే మెగా హీరో చిత్రం విడుదల !
Published on Oct 26, 2017 8:43 pm IST

అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో విఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా కు మణిశర్మ సంగీత దర్శకుడు. శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం కావడం, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

సినిమా విడుదల గురించి మాట్లాడాల్సి వస్తే.. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది, డిసెంబర్ 21న నాని ’ఎంసిఎ’ 22 న అఖిల్ విడుదల అవుతున్నట్లు ప్రకటించారు. నాని సినిమా ఒక వారం పోస్ట్ పోన్ అవొచ్చు అనుకుంటున్నారు, అయితే అల్లు శిరీష్ సినిమాను కూడా డిసెంబర్ 21 లేదా29 న ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆలోచనలు ఉన్నాయి. అబ్బూరి రవి మాటలు అందిస్తున్న ఈ సినిమాకు చోటా కె ప్రసాద్ ఎడిటర్.

 
Like us on Facebook