ఓటిటిలో అప్పుడే ఇండియా ట్రెండ్స్ లోకి “హను మాన్” సెన్సేషన్

ఓటిటిలో అప్పుడే ఇండియా ట్రెండ్స్ లోకి “హను మాన్” సెన్సేషన్

Published on Mar 17, 2024 3:33 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “హను మాన్” (Hanu Man Movie). మరి సూపర్ హీరో జానర్ లో వచ్చిన ఈ చిత్రం దీనికి తోడు హనుమాన్ ఫ్యాక్టర్ కూడా కలవడంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం వండర్స్ సెట్ చేసింది. ఇక అంతా ఎప్పుడప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఓటిటిలో రిలీజ్ హిందీ సహా తెలుగులో (Hanu Man OTT Release) అయితే ఇప్పుడు వచ్చేసింది.

మరి జీ 5 (Hanu Man On Zee 5) లో ఈరోజే స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ చిత్రం వచ్చిన కొన్ని గంటల్లోనే ఇండియా వైడ్ గా టాప్ 2 ట్రెండింగ్ లోకి వచ్చేయడం సెన్సేషన్ అనే చెప్పాలి. కొన్ని చిత్రాలు మినిమమ్ ఒక రోజు అయినా తీసుకుంటాయి. కానీ అలాంటిది హను మాన్ జస్ట్ గంటల వ్యవధిలోనే రావడం అనేది ఈ సినిమా పై ఉన్న క్రేజ్ కి నిదర్శనం. మరి చూడాలి ముందు ముందు ఏ రేంజ్ రెస్పాన్స్ ని అందుకుంటుంది అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు