విడాకుల వ్యవహారంలో ఆసక్తికర నిజాలను బయటపెట్టిన ‘అమలా పాల్’ భర్త
Published on Aug 3, 2016 8:56 pm IST

Amala-Paul-and-Vijay
నటి ‘అమలాపాల్’ తమిళ దర్శకుడు ‘విజయ్’ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్నాళ్ళకు వాళ్ళ వైవాహిక జీవితం కాస్త విడాకుల వరకూ వెళ్ళింది. చాలామంది విజయ్ తల్లిదండ్రులకు అమలా పాల్ సినిమాలో నటించడం ఇష్టం లేదని ఒకవేళ సినిమాలు చేస్తే అది వాళ్ళ వైవాహిక జీవితాన్ని దెబ్బ తీస్తుందని అనుకునే వాళ్ళని అన్నారు.

కానీ విజయ్ ఇదంతా అబద్దమని, తన తల్లిదండ్రులు అమలా పాల్ ను సినిమాలు చెయ్యొద్దని చెప్పలేదని, వాళ్ళు అలాంటి వారు కాదని అవన్నీ ఒట్టి పుకార్లనీ ఎవరో కావాలనే కల్పించారని తెలియజేశారు. దీంతో ఈ వ్యవహారం మరింతగా వేడెక్కింది. అయితే ఈ విడాకులు వ్యవహారం వెనుక ఉన్న అసలు కారణాలేవనేది ఇంకా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook