లేటెస్ట్..”వీరమల్లు” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుందా?

Published on Aug 17, 2021 9:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. పవన్ కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం కొంతమేర షూట్ ని కంప్లీట్ చేసుకొని త్వరలోనే మిగతాది కూడా కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది.

అయితే ఈ భారీ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానున్నట్టుగా సినీ వర్గాల్లో బజ్ వినిపిస్తుంది. అది కూడా ఈరోజే అన్నట్టుగా టాక్.. మరి దీనిలో ఎంత వరకు నిజముందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన యంగ్ అండ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :