“ఆదిపురుష్” నుంచి ఊహించని బహుమానమే రానుందా?

Published on Oct 6, 2021 9:36 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న పలు భారీ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసిన భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. రీసెంట్ గానే సినిమా ఫైనల్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసుకొని ఈ నెల మూడో వారానికల్లా దానిని కంప్లీట్ చేసే పనిలో ఉంది.

అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఓ ఊహించని బహుమానమే వచ్చేలా ఉందని తెలుస్తుంది. తాజా బజ్ ప్రకారం వచ్చే ప్రభాస్ బర్త్ డే కానుకగా ఆదిపురుష్ నుంచి అద్భుతమైన ట్రీట్ రాబోతుందట. ప్రస్తుతానికి అయితే రామునిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఏమో అని ఓ టాక్ చుట్టూతా తిరుగుతుంది. మరి అదా లేక ఇంకాఆ వెరీ స్పెషల్ అప్డేట్ ని ఏమన్నా మేకర్స్ రివీల్ చేస్తారా అన్నది ఇపుడు మరింత ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :