ఈరోజు “బిగ్ బాస్” ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ ఉందా?

Published on Sep 20, 2020 4:30 pm IST

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పుడు అలా కొనసాగుతుంది. మొట్టమొదటి ఎంట్రీ ఎపిసోడ్ తో గ్రాండ్ వెల్కమ్ అందుకున్న ఈ షో తర్వాత మాత్రం చెప్పగానే కొనసాగుతుంది అని టాక్ వచ్చేసింది. దీనితో అప్పుడే వైల్డ్ కార్డు ఎంట్రీలను ముందుగానే షురూ చేసేసారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది అన్నట్టుగా నాగ్ కన్ఫర్మ్ చేసేసారు.

అందులో భాగంగా కరాటే కళ్యాణి కూడా ఎలిమినేట్ అయ్యిపోయింది. మరి ఇక రెండో కంటెస్టెంట్ ఎవరా అని అంతా అనుకుంటున్నారు. ఇపుడు ఆ రెండో కంటెస్టెంట్ పేరు దేతడి హారిక అన్నట్టు టాక్. అయితే ఇక్కడే బిగ్ బాస్ ఊహించని మలుపు పెట్టనున్నాడని తెలుస్తుంది. ఆమెను ఎలిమినేట్ చేసినట్టే చేసి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారట. మరి ఇదే జరుగుతుందో లేదో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :

More