సంక్రాంతి బరిలో రిలీజైన తెలుగు చిత్రాల్లో ‘అనగనగా ఒక రాజు’ మరియు ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఊపులో కొనసాగుతున్నాయి. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’కు మారి దర్శకత్వం వహించగా.. శర్వానంద్ ప్రధాన పాత్రలో రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ‘నారీ నారీ నడుమ మురారి’ మరింత పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతోంది. రిలీజ్ అయిన తొలి రోజుల్లోనే ఈ రెండు రొమాంటిక్ ఎంటర్‌టైనర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా నైజాం ఏరియాలో ఆదివారం ‘అనగనగా ఒక రాజు’ రూ.1.15 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ను, ‘నారీ నారీ నడుమ మురారి’ రూ.45 లక్షల షేర్‌ను వసూలు చేశాయి. ఇప్పటివరకు ‘అనగనగా ఒక రాజు’ నైజాం మార్కెట్‌లో మొత్తం రూ.5.20 కోట్ల షేర్‌ను సాధించగా, శర్వానంద్ సినిమా రూ.2.10 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కలు ట్రేడ్ వర్గాల్లో మంచి చర్చకు దారి తీస్తున్నాయి.
సంక్రాంతి సెలవులు ముగియడంతో ఇప్పుడు ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఎంతవరకు నిలబడతాయన్నది ఆసక్తికరంగా మారింది. ‘అనగనగా ఒక రాజు’లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా.. ‘నారీ నారీ నడుమ మురారి’లో సంయుక్త మరియు సాక్షి వైద్య హీరోయిన్లుగా సందడి చేశారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు ఉండటంతో ఈ సినిమాలు మరికొన్ని రోజులు బాక్సాఫీస్ వద్ద నిలబడతాయన్న అంచనాలు ఉన్నాయి.
