ఆకట్టుకుంటున్న ఆనంద్ దేవరకొండ “హైవే” ట్రైలర్!

ఆకట్టుకుంటున్న ఆనంద్ దేవరకొండ “హైవే” ట్రైలర్!

Published on Aug 16, 2022 1:35 PM IST

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ హైవే చిత్రం తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నాడు. కెవి గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైకో థ్రిల్లర్ డైరెక్ట్ ఓటిటి గా విడుదల కానుంది.

తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ అయిన ఆహా ఈరోజు యూట్యూబ్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. కాగా యువ నటుడు నాగశౌర్య ట్రైలర్‌ను డిజిటల్‌గా విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఒక ఇంటెన్స్ రోడ్ థ్రిల్లర్‌గా హామీ ఇస్తుంది. ఒక సైకో నుండి ఆనంద్ దేవరకొండ ఒక మహిళ (మానస రాధాకృష్ణన్) జీవితాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాడు.

పాతాళ్ లోక్ ఫేమ్ అభిషేక్ బెనర్జీ ఈ చిత్రం లో కీలక పాత్రలో నటిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం లో జాన్‌ విజయ్‌, రేష్మ పసుపులేటి, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. వెంకట్ తలారి నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 19, 2022న ఆహాలో ప్రదర్శించబడుతుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు