విజయ్ ను ఈ హీరోయిన్ కూడా పొగిడేస్తోందిగా !

Published on Feb 27, 2020 1:15 am IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన సక్సెస్ కిక్ తో తన తరువాత సినిమాని క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ చేస్తోన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో అనన్య పాండే కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఆమె తన హీరో విజయ్ దేవరకొండ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతూ.. ‘విజయ్ చాల స్మార్ట్ అండ్ కైండ్.. అందరితో బాగా మాట్లాడతాడు, ముఖ్యంగా తనకు సంభాషణను ఎలా కొనసాగించాలో బాగా తెలుసు, తనతో కలిసి వర్క్ చేయడం చాల హ్యాపీగా ఉందని’ తెలిపింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

ఇప్పటికే జాన్వీ కపూర్, ఆలియా భట్ లాంటి హీరోయిన్స్ విజయ్ దేవరకొండను పొగిడేశారు. ఇప్పుడు అనన్య కూడా పొగిడేసింది. ఇక ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :