అనసూయ ప్రచారం మెదలుపెట్టారుగా…!

Published on Aug 4, 2019 3:00 am IST

జబర్దస్త్ ఫేమ్ అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “కథనం”. అనసూయ ఈ చిత్రంలో రచయితగా కనిపిస్తుండగా దర్శకుడు రాజేష్ నాదెండ్ల క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు. గాయత్రి ఫిలిమ్స్ బ్యానర్ పై నరేంద్రారెడ్డి బత్తెపాటి,శర్మ చుక్క సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధన్ రాజ్,వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల,సంపూర్ణేష్ వంటి నటులు నటిస్తుండగా ఈ నెల 9న విడుదల కానుంది.

నిజానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సివుంది. మార్చి నెలలోనే “కథనం” చిత్ర టీజర్ ని విడుదల చేయడం జరిగింది. దీనితో వేసవి కానుకగా ఈ చిత్రం వస్తుందని భావించారు. కానీ చిత్ర యూనిట్ ఒక్కసారిగా ఈ చిత్రం పై అప్డేట్స్ ఇవ్వడం తగ్గించారు. ఆసక్తికరంగా కొద్దిరోజుల క్రితం చిత్ర విడుదల తేదీ ప్రకటిస్తూ పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. విడుదలకు ఇంకా కేవలం వారం రోజులే ఉండటంతో ప్రచారంపై దృష్టి సారించారు. నేడు నటీనటులతో పాటు,దర్శక నిర్మాతలు ప్రెస్ మీట్ లో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు. అలాగే చిత్ర ట్రైలర్ నేడు విడుదల చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :