స్పెషల్ సాంగ్ లో ప్రముఖ యాంకర్ !

Published on Dec 5, 2018 9:25 am IST


ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ మరో సారి స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఇంతకుముందు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ లో సాయి ధరమ్ తో కలిసి స్టెప్పులు వేసిన ఆమె తాజాగా వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నది.

అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ లో వెంకీ , వరుణ్ కలిసి నటిస్తున్నారని తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఒక ఫన్ సాంగ్ లో వీరిద్దరి తో కలిసి స్టెప్పులు వేయనుంది అనసూయ. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈరోజు ఈచిత్రానికి సంబందించిన ఒక ముఖ్యమైన అప్ డేట్ రివీల్ కానుంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :