ఆహాలోకి అనసూయ ‘థాంక్యూ బ్రదర్’ !

Published on Apr 26, 2021 2:30 pm IST

నటి, యాంకర్ అనసూయకు ఈ మధ్య సినిమా ఆఫర్లు బాగా పెరిగాయి. కొన్ని ప్రత్యేక పాత్రలు, ప్రత్యేక గీతాల కోసం ఆమెను అప్రోచ్ అవుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘థాంక్యూ బ్రదర్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఆహా యాప్ లో మే 7వ తేదీన రిలీజ్ అవబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంలో మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డితో కలిసి తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు ర‌మేశ్ రాప‌ర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. దర్శకుడిగా పరిచయం అవుతున్న రమేష్ రాపర్తి కి యూనిట్ కి అభినందనలు, ఇక ఈ సినిమాలో అర్చన, వైవా హర్ష, అనిల్ కురువిల్లా, అన్నపూర్ణ, మౌనిక రెడ్డి, ఆదర్శ్, కాదంబరి కిరణ్ సమీర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక అనసూయ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానుంది.

సంబంధిత సమాచారం :