పవన్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన యాంకర్!

jhansi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎలాంటి వేడుకల్లోనైనా తమ హీరోను తల్చుకుంటూ నినాదాలు చేస్తారన్న పేరుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకసారి పవన్ అభిమానుల నుంచి వచ్చిన ఈ ‘పవర్ స్టార్’ నినాదంపై చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్ పెద్ద దుమారమే రేపింది. తాజాగా ‘వంగవీటి’ ఆడియో ఫంక్షన్‌లోనూ ఇలాంటిదే సంఘటన ఒక రిపీట్ అయింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వంగవీటి అనే క్రైమ్ డ్రామా నిన్న విజయవాడలో వైభవంగా ఆడియో లాంచ్ జరుపుకుంది.

ఈ ఆడియో లాంచ్‌కు పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం కొందరు విచ్చేశారు. ఇక వారంతా పవర్ స్టార్ అని నినదిస్తూ ఉండగా, “వేరే ఆడియో ఫంక్షన్స్‌లో ఇలా అరిచే ఇలాంటి కొంతమంది పవన్ అభిమానుల వల్లనే మొత్తం అభిమానులందరికీ చెడ్డపేరొస్తోంది. పవన్ కళ్యాణ్ గారంటే డిసిప్లిన్ అన్న పేరుంది. అలాంటి గొప్ప వ్యక్తికి అభిమానులమని చెప్పుకుంటున్న ఇక్కడున్న కొంతమంది మాత్రం డిసిప్లిన్ లేకుండా ఇలా మొత్తం పవన్‌ అభిమానులకు మచ్చ తెస్తున్నారు” అంటూ ఈ కార్యక్రమానికి యాంకర్‌గా పనిచేసిన ఝాన్సీ అక్కడున్న కొద్దిమంది అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.