వైరల్ : “హను మాన్” లో కీలక అంశం మెగాస్టార్ రిఫరెన్సే?

వైరల్ : “హను మాన్” లో కీలక అంశం మెగాస్టార్ రిఫరెన్సే?

Published on May 4, 2024 9:59 AM IST

ఈ ఏడాదిలో ఇప్పుడు వరకు మన టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్ లో వచ్చిన భారీ చిత్రం “హను మాన్” (Hanu Man Movie) అనే చెప్పాలి. మన తెలుగు సినిమా నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమా కావడం అందులో ఫస్ట్ అటెంప్ట్ లోనే పాన్ ఇండియా క్రేజ్ ఈ చిత్రానికి రావడంతో ఇప్పుడు దీని సీక్వెల్ “జై హనుమాన్” (Jai Hanuman) పై భారీ హైప్ నెలకొంది.

అయితే హను మాన్ సినిమా విషయంలో మొదటి నుంచి కూడా ఎందుకో మెగాస్టార్ చిరంజీవితో కనెక్షన్ ఉంటూనే వస్తుంది. అలా హను మాన్ లో భజరంగ్ గా చిరు నటిస్తున్నారు అనే టాక్ నే చాలా క్రేజ్ తీసుకొచ్చింది. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అంశం వైరల్ గా మారింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ తో ప్రశాంత్ వర్మ విజన్ తో రూపొందించిన భారీ హనుమంతుని విగ్రహం అంజనాద్రి ఎంట్రెన్స్ లో ఉంటుంది.

అయితే విగ్రహం రూపానికి ప్రధాన కారణం రిఫరెన్స్ మెగాస్టార్ చిరంజీవే అని ఓ టాక్ వైరల్ గా మారింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ స్టాలిన్ లోని మెగాస్టార్ స్టిల్ ఒకటి చూసి ప్రేరణ చెంది అలా డిజైన్ చేసాడు అన్నట్టుగా ఓ స్టేట్మెంట్ వైరల్ అవుతుంది. ఇది అన్నట్టు ఎక్కడా కనిపించలేదు కానీ సినిమా చూసినవారు, అభిమానులు మాత్రం ఆ విగ్రహాన్ని చూసినప్పుడు థియేటర్స్ లో కూడా అలానే అనుకున్నాం అని అంటున్నారు.

మరి ఆ స్టేట్మెంట్ ప్రశాంత్ వర్మ ఇచ్చినా ఇవ్వకపోయినా మాత్రం ఆ విగ్రహం విజువల్స్ లో మెగాస్టార్ కనిపించింది మాత్రం వాస్తవం అని చెప్పవచ్చు. ఈ రకంగా అయితే చిరు ఆరాధ్య దైవం పరోక్షంగా కూడా తన వెంటే ఉన్నారని చెప్పుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు