మన తెలుగు స్మాల్ స్క్రీన్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి మోస్ట్ ఫేవరెట్ యాంకర్ లలో ప్రదీప్ మాచిరాజు కూడా ఒకడు. మరి ప్రదీప్ స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పైకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా తాను నటించిన రీసెంట్ చిత్రమే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తో వచ్చిన ఈ చిత్రాన్ని దర్శకులు నితిన్, భరత్ లు తెరకెక్కించారు.
అయితే ఈ చిత్రం థియేటర్స్ లో వచ్చాక విమర్శకులు, చూసిన ఆడియెన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలో అలరించేందుకు వచ్చేసింది. ఈ చిత్రాన్ని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి అప్పుడు థియేటర్స్ లో మిస్ అయ్యినవారు ఇప్పుడు డెఫినెట్ గా ఓటిటిలో ట్రై చేయవచ్చు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి