ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్న ‘అంధగాడు’ టీమ్ !
Published on May 29, 2017 8:59 am IST


భిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలందుకుంటున్న యంగ్ హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఇటీవలే ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ‘అంధగాడు’ అనే చిత్రంలో నటించాడు. రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా మారుతూ చేసిన ఈ చిత్రం అన్ని పనుల్ని పూర్తి చేసుకుని జూన్ 2వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

ఇదిలా ఉండగా చిత్ర్ర నిర్మాతలు విడుదల కంటే ఒకరోజు ముందే తెలుగు రాష్ట్రాలైన ఏపి, తెలంగాణల్లోని పలు ప్రధాన నగరాల్లో జూన్ 1వ తేదీన ప్రీమియర్ షోలను ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రీమియర్ షోల ద్వారా పాజిటివ్ టాక్ బయటికొస్తే సినిమా ఓపెనింగ్స్ మంచి స్టాయిలో ఉండొచ్చనేది నిర్మాతల ఆలోచన. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించింది.

 
Like us on Facebook