మీరెవరూ ముద్దులు పెట్టుకోరా అంటూ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ !
Published on Oct 29, 2017 6:21 pm IST


హీరో సిద్దార్థ్ చేసిన తాజా చిత్రం ‘గృహం’. అన్ని పనుల్ని పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ కానుంది. ట్రైలర్ లో మన్హసి హర్రర్ కంటెంట్ ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆససక్తి పెరిగింది. దానికి తోడు నటి ఆండ్రియా లిప్ లాక్ సన్నివేశాలు కూడా హాట్ టాపిక్ గా మారిపోయి చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయి.

తాజాగా జరిగిన ప్రమోషన్లలో ఈ లిప్ లాక్ ల విషయమై ప్రస్తావన రాగా ఆండ్రియా చాలా ఘాటుగా స్పందించారు. మీరంతా ఇళ్లల్లో కిస్ చేయరా అంటూ కౌంటర్ విసిరారు. అంతేగాక ఈరోజుల్లో యువత తమ ప్రేమను ఎంత పబ్లిక్ గా వ్యక్తపరుస్తున్నారో చూడాలన్నారు. సిద్దార్థ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ మిలింద్ తెరకెక్కించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఒకేరోజు విడుదలకానున్న ఈ సినిమాతో ఎలాగైనా గత్ వైభవాన్ని తెచ్చుకోవాలని సిద్దార్థ్ అభిప్రాయపడుతున్నారు.

 
Like us on Facebook