‘ఎఫ్ 3’ షూటింగ్ మళ్ళీ అప్పటి నుండే !

Published on Apr 25, 2021 10:00 pm IST

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం కరోనా నుండి కోలుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోలుగా వస్తోన్న ‘ఎఫ్ 3’ మూవీ షూటింగ్ గురించి ఒక లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది, ఈ సినిమా షూట్ ను జూన్ ఫస్ట్ వీక్ నుండి హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సారధి స్టూడియోలో వేసిన ఒక ఓల్డ్ హౌస్ లో వెంకీ వరుణ్ ల పై కొన్ని కామెడీ సీన్స్ తీస్తారట.

ఇక ఇప్పటికే ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు. అయితే ఈ సీక్వెల్ లో కూడా త‌మ‌న్నా, మెహ‌రీన్‌లే క‌థానాయిక‌లుగా న‌టించబోతున్నారు. వీళ్ళు వెంకీ వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. మొత్తానికి భార్యల టార్చరే ఎఫ్ 3 కథకు మెయిన్ మోటివ్ అని సమాచారం. ఇప్పటికే నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబులు నాలుగు నెలల్లో సినిమాని పూర్తి చేసి.. దసరాకు ఎఫ్ 3 రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారట.

సంబంధిత సమాచారం :