డిజిటల్ వరల్డ్ లోకి అన్నపూర్ణ స్టూడియోస్.?

Published on May 1, 2021 2:00 pm IST

ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా గత ఏడాది కాలం నుంచి అయితే డిజిటల్ కంటెంట్ ను మరింత ఆదరణ ఇస్తూ వస్తున్నారు. అయితే జస్ట్ అంతకు ముందే మన తెలుగు నుంచి “ఆహా” అనే మొట్టమొదటి స్ట్రీమింగ్ యాప్ స్టార్ట్ అయ్యింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ టీం నుంచి వచ్చిన ఈ యాప్ సూపర్ సక్సెస్ అయ్యింది.

ఇక ఇప్పుడు మరో ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి అన్నపూర్ణ స్టూడియోస్ వారు కూడా డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అధినేత అక్కినేని నాగార్జున సహా తన స్నేహితులతో కలిసి సరికొత్త ఓటిటి యాప్ స్టార్ట్ చెయ్యనున్నారట. బిజినెస్ పరంగా నాగ్ ఏదన్నా స్టార్ట్ చేస్తే దాని అవుట్ పుట్ ఎలా ఉంటుందో అందరికీ బాగా తెలుసు మరి దీనికి ఎలాంటి ప్లాన్ చేస్తున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :