ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా ‘రోలుగుంట సూరి’ సినిమాలోని మొదటి పాట విడుదలైంది. గ్రామీణ నేపథ్యం (విలేజ్ బ్యాక్‌డ్రాప్)లో రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలప్ (Bhawana Neelap) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పాటను విడుదల చేసిన అనంతరం అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ, మంచి కథ, దానికి తగ్గట్టుగా సంగీతం ఉంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు. ‘రోలుగుంట సూరి’ కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించే కథ, సంగీతంతో కూడిన చిత్రమని, ఇది పెద్ద హిట్ అవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. దర్శకుడు అనిల్ కుమార్ పల్లా కృతజ్ఞతలు తెలుపుతూ, తమ కృషిని, టీమ్ టాలెంట్‌ను అనూప్ రూబెన్స్ అభినందించడం సంతోషంగా ఉందని చెప్పారు. నిర్మాత సౌమ్య చాందిని పల్లా మాట్లాడుతూ, ఈ రియలిస్టిక్ విలేజ్ డ్రామా భావోద్వేగాలు, జీవిత సత్యాలతో కూడినదని, తమ సినిమా అవుట్‌పుట్ అత్యున్నత స్థాయిలో ఉందని తెలిపారు. ఈ చిత్రం తెలుగులో అరుదైన సినిమాగా నిలిచిపోతుందన్న నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేసింది.


