లేటెస్ట్..”RRR” నుంచి మరో బ్లాస్ట్ రెడీగా ఉందట.!

Published on Jul 18, 2021 5:18 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ “రౌద్రం రణం రుధిరం” కోసమే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన సాలిడ్ మేకింగ్ వీడియో కట్ కి భారీ రెస్పాన్స్ రాగా రాజమౌళి అండ్ టీం ఈ సినిమా నుంచి మరిన్ని సాలిడ్ అప్డేట్స్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ఇప్పుడు లేటెస్ట్ గా ఓ ఆసక్తికర హింట్ ఇస్తున్నారు.

పెద్దగా డీటెయిల్స్ ఏమి బయట పెట్టకుండా “RRR” నుంచి మరో బ్లాస్టింగ్ అప్డేట్ రానున్నట్టుగా జస్ట్ సినిమా రిలేటెడ్ ఎమోజిస్ తో కన్ఫర్మ్ చేశారు. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి నీరు, నిప్పు లాంటి రెండు పవర్ ఫుల్ ఫోర్సెస్ కి ప్రతీకగా తారక్, చరణ్ ల భీం, అల్లూరి పాత్రలను చూపిస్తున్నారు. మరి ఈ ఇద్దరి కలయికలో ఉండే టీజర్ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. మరి బహుశా ఆ టీజర్ పైనే హింట్ ఇది కావచ్చు. మరి ఈ హింట్ వెనుక ఏమిటి అన్నది వారికే తెలియాలి. సో ఆ అప్డేట్ దేని కోసమా అన్నది వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :