ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్రాండ్ !

Published on Dec 16, 2018 7:38 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో బ్రాండ్ కు ప్రచారకర్తగా సైన్ చేశాడని సమాచారం. ఇప్పటికే సెలక్ట్ మొబైల్స్ అలాగే నవరత్న ఆయిల్ కు ప్రచారకర్త గా వ్యవహరిస్తున్న తారక్ తాజాగా అప్పిఫిజ్ అనే డ్రింక్ కు అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. దీనికిగాను ఆయన 5కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడట. మూడు సంవత్సరాలకు గాను ఎన్టీఆర్ ఈ బ్రాండ్ తో ఒప్పదం కుదుర్చుకున్నాడు.

ఇక ఇటీవల ‘అరవింద సమేత’ తో ప్రేక్షకులముందుకు వచ్చిన ఎన్టీఆర్ ఆ చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ అనే మల్టీ స్టారర్ చిత్రం లో నటిస్తున్నాడు. 2020 లోఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :