‘చరణ్ – శంకర్’ సినిమాలో మరో హీరోయిన్ ?

‘చరణ్ – శంకర్’ సినిమాలో మరో హీరోయిన్ ?

Published on Aug 16, 2021 12:00 PM IST

Shankar Ram Charan 1

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ – విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో మరో హీరోయిన్ తమన్నా కీలక పాత్రలో నటించనుందని తెలుస్తోంది. కాకపోతే హీరోయిన్ గా కాదు. విలన్ భార్యగా తమన్నా నటిస్తోందట. ఐతే హీరోయిన్ కి సమాంతరంగా తమన్నా పాత్ర ఉందట. ఎలాగూ తమన్నా, ఇప్పటికే చరణ్ తో కలిసి నటించింది.

ఇక ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అయితే, భారీ బడ్జెట్ రాబోతున్న ఈ భారీ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ నడుస్తోంది. 20 నిమిషాల నిడివి కలిగిన ఆ పవర్ ఫుల్ పాత్ర.. సినిమాలోనే కీలకమైనది అట. ఇక సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ భారీ సినిమాలో రామ్ చరణ్ ను కూడా చాల వినూత్నంగా చూపించబోతున్నాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు