‘సామీ స్క్వేర్’లో మరొక హీరోయిన్ !

Published on Jul 4, 2018 10:48 am IST


చియాన్ విక్రమ్, త్రిషలు జంటగా2003లో దర్శకుడు హరి రూపొందించిన చిత్రం ‘సామి’ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘సామి స్క్వేర్’ ను రూపొందిస్తున్నారు హరి. ఈ పోలీస్ స్టోరీలో విక్రమ్ కు జంటగా కీర్తి సురేష్ నటిస్తుండగా ఇప్పుడు మరొక నటికి ఇందులో ఛాన్స్ దక్కింది.

ఆ నటి మరెవరో కాదు ఐశ్యర్య రాజేష్. ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళంలో బిజీ హీరోయిన్. ఆమె చేతిలో పలు మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈమె విక్రమ్ తో కలిసి ‘ధృవ నచ్చత్తిరం ‘ అనే సినిమాలో కూడ నటిస్తోంది. ఇకపోతే ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సామీ స్క్వేర్’ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. విక్రమ్, హరి సినిమాలకి తెలుగునాట మంచి క్రేజ్ ఉండటం మూలాన తెలుగునాట ఈ సినిమాని మంచి స్థాయిలో విడుదలచేయనున్నారు.

సంబంధిత సమాచారం :