ఏపీ టికెట్ ధరలు : తన గళం విప్పిన మరో యంగ్ హీరో.!

Published on Dec 26, 2021 4:00 pm IST

ఏపీలో గత కొన్ని నెలల నుంచి కూడా ఎలాంటి పరిస్థితిని తెలుగు సినిమా ఎదుర్కొంటుందో చూస్తూనే ఉన్నాము. ఆకస్మికంగా తీసుకువచ్చిన కొత్త రూల్స్ తో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అలాగే థియేటర్స్ వ్యవస్థ చాలా ఇబ్బందులు పడుతుంది. అయితే ఈ సంబంధించి టాలీవుడ్ హీరోలు ఒకొకరిగా తమ స్పందనను తెలియజేస్తున్నారు.

మరి ఇటీవల నాచురల్ స్టార్ నాని తన వ్యూ ని చెప్పకనే మరోసారి చెప్పేసాడు. ఇప్పుడు నానితో పాటుగా ఈ సమస్యపై మరో యంగ్ హీరో కూడా గళం విప్పాడు. అతడే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ. తనదైన ఇంట్రెస్టింగ్ సినిమాలతో టాలీవుడ్ ఆడియెన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చే సిద్ధార్థ్ కూడా ఇపుడు ఏపీలో నెలకొన్న పరిస్థితిపై సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియజేసాడు.

ఎలా అయితే ట్రైన్స్ లో టైర్స్ విభాగంలా పలు సెక్షన్ లు ఉన్నట్టు థియేటర్స్ లో కూడా బాల్కనీ, ప్రీమియం సెక్షన్స్ కి కూడా తగు ధరలు ఉండేలా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని ఇప్పుడు సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ వారికి అందుబాటులో ఉండేలా ఉందని.

నాకు థియేటర్లు అంటే దేవాలయంతో సమానం. కానీ అలాంటిది కొన్ని థియేటర్స్ మూతబడిపోవడం చూస్తుంటే హార్ట్ బ్రేకింగ్ గా ఉంది. తాజాగా తెలంగాణా ప్రభుత్వం వారు ఇండస్ట్రీకి ఇచ్చిన సపోర్ట్ కి ధన్యవాదాలు అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఈ థియేటర్లు సమస్యకు సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపుతారని అనుకుంటున్నాని నిఖిల్ తెలిపాడు.

సంబంధిత సమాచారం :