‘అనుకోని అతిధి’ అనుకున్న డేట్ కి రావట్లేదు !

Published on Nov 11, 2019 10:21 pm IST

క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి మలయాళ నటుడు ఫహాద్ ఫైజల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మలయాళ మూవీ ‘అథిరన్’. కాగా ఈ సినిమా ‘అనుకోని అతిధి’ అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ మారినట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనుంది.

దర్శకుడు వివేక్ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో మంచి హిట్ అయింది. అందుకే ఈ సినిమాని ఇంట్రోపీ ఫిలిమ్స్ బ్యానర్ పై అన్నపురెడ్డి కృష్ణ కుమార్, గోవింద రవి కుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి రానా హీరోగా వస్తోన్న ‘విరాటపర్వం’లో అలాగే నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

More