ఇంటర్వ్యూ : బాలు అడుసుమిల్లి – ఈ సినిమా అమ్మాయిల పాయింటాఫ్ వ్యూలో ఉంటుంది.

Published on Mar 4, 2020 8:07 pm IST

బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. కాగా మార్చి 6న ఈ చిత్రం విడుదల అవ్వబోతుంది. ఈ సందర్భంగా బాలు అడుసుమిల్లి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

ఈ ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ ప్రయాణం ఎలా మొదలైంది ?

నేను కొత్త డైరెక్టర్ ను కాబట్టి ఏ హీరో నాకు డేట్స్ ఇవ్వడు అనిపించింది. మరి ఏమి చెయ్యాలి అనుకుంటున్న క్రమంలో చేస్తే ఏదైనా కొత్తగా చేద్దామనుకున్నాను. అలాంటి సమయంలో ఫ్రెండ్స్ ఇచ్చిన ఐడియాతో ఈ కథ పుట్టింది.

నలుగురు హీరోయిన్స్ ను పెట్టడానికి కారణం కమర్షియల్ యాంగిలేనా ?

ఒక్క కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకునే నలుగురు హీరోయిన్స్ ను పెట్టుకోలేదు అండి. కథకు ఆ పాత్రలు అవసరం అనిపించింది కాబట్టే నలుగురు అమ్మాయిలను తీసుకున్నాము.

సినిమాకి సెన్సార్ ఇబ్బందులు ఏమైనా వచ్చాయా ?

లేదండి. సెన్సార్ ను దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ రాసుకున్నాను. లక్కీగా సెన్సార్ బోర్డు లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి సీన్ గురించి వారితో చర్చించే అది కట్ అయిపోతుందా లేక ఉంటుందా అని డిస్కస్ చేసి ప్రతి సీన్ తీయడం జరిగింది.

సినిమాలో అమ్మాయిలు కూర్చుని తాగే సీన్స్ కూడా ఉన్నాయి కదా ?

అవును అండి. నలుగురు అమ్మాయిలు కూర్చుని ఏమి మాట్లాడుకుంటారో అదే ఈ సినిమాలో చూపించాము.

సినిమాలో ఎంటర్ టైన్మెంట్ ఎలా ఉండబోతుంది ?

ఎంటర్ టైన్మెంట్ అయితే సినిమాలో కావాల్సినంత ఉంది. అలాగే సప్సెన్స్ ఎలిమెంట్స్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాని అమ్మాయిల పాయింటాఫ్ వ్యూలో చూపించాను.

మీకు డైరెక్షన్ పై ఎలా ఇంట్రస్ట్ కలిగింది ?

చిన్నప్పటి నుండి డైరెక్షన్ మీద బాగా ఇంట్రస్ట్ ఉంది. నేను మొదట డైరెక్టర్ అవ్వుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఆ తరువాత కొన్ని కారణాల వల్ల మీడియాలోకి వెళ్లాను. కానీ ఎక్కడో అసంతృప్తి ఉంది. అందుకే మళ్లీ సినిమాల్లోకి వచ్చి ఈ సినిమా తీసాను.

అసలు ఈ సినిమాలో ఆడియన్స్ ఏం ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చు ?

ఎంటర్ టైన్మెంట్ అండి. నా దృష్టిలో సినిమా అంటేనే ఫుల్ ఎంటర్ టైన్మెంట్.. ఆడియన్స్ సినిమాకి వచ్చేది జస్ట్ ఎంజాయ్ చెయ్యడానికి. అదే అయితే ఉంటుంది.

మీ తదుపరి సినిమా గురించి ?

తరువాత సినిమా గురించి కూడా ఈ సినిమాలోనే చిన్న క్లూ ఇచ్చాను. అంటే పార్ట్ 2 కూడా చేద్దామని ఐడియా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక నేను పెట్టిన డబ్బులు వెనక్కి వస్తేనే ఆ సినిమా చేస్తాను.

సంబంధిత సమాచారం :