డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ ” బటర్‌ఫ్లై”

డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ ” బటర్‌ఫ్లై”

Published on Dec 11, 2022 10:56 PM IST

బబ్లీ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్‌తో కలిసి తన తదుపరి చిత్రం 18 పేజెస్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 23, 2022 న గ్రాండ్ రిలీజ్ కానుంది. మరోవైపు, నటి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న చిత్రం బటర్‌ఫ్లై ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను పొందింది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డైరెక్ట్ డిజిటల్ గా విడుదల కానున్న విషయాన్ని ఇది వరకే వెల్లడించడం జరిగింది.

ఈ సినిమా డిసెంబర్ 29, 2022న ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుందని ప్రకటించడానికి ఓ ప్రోమోను నేడు విడుదల చేయడం జరిగింది. ఘంటా సతీష్ బాబు రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిహాల్ కొదటి కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో ఒకప్పటి నటి భూమికా చావ్లా కూడా కీలక పాత్రలో నటించింది. జెన్ నెక్స్ట్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి అర్విజ్ మరియు గిడియన్ కట్టా సంగీతం అందించారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు