రామ్ తో మరోసారి జోడీ కట్టకున్న అనుపమ ?

యంగ్ హీరో రామ్ త్వరలో ‘నేను లోకల్’ దర్శకుడు త్రినాథ్ రావ్ నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ కు జోడీగా మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రామ్, అనుపమ కలిసి నటించిన ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రం బాక్సాఫీస్ పరంగా పెద్ద విజయాన్ని అందుకోకపోయినా వీరిద్దరి జోడీకి మంచి మార్కులే పడ్డాయి.

అందుకే నిర్మాత దిల్ రాజు వాళ్ళ జోడీని రిపీట్ చేసి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు. అనుపమ్ ఆగతంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన జాతీయ అవార్డు చిత్రం ‘శతమానంభవతి’లో నటించిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్రముఖ పాత్రలో నటించనున్న ఈ చిత్రాన్ని మార్చి నెల నుండి మొదలుపెట్టనున్నారు.