Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
దివ్యాంగురాలిగా నటించబోతున్న అనుష్క ?
Published on Jan 13, 2019 3:36 am IST

‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ని అందుకున్న అనుష్క.. ఆ తరువాత ఆమె ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. కొంచం విరామం తీసుకుని ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మాధవన్, సుబ్బరాజ్ ముఖ్య పాత్రల్లో థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘సైలెన్స్’ అనే సినిమాలో అనుష్క నటిస్తోన్న విషయం తెలిసిందే.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనుష్క ఓ దివ్యాంగురాలి పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మార్చి నుండి షూటింగ్ ను జరుపుకోనుంది. సినిమాలో ఎక్కువ భాగం ఫారన్ లో జరిగే ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

సంబంధిత సమాచారం :