మిలియన్ డాలర్లు కురిపించిన అనుష్క !

4th, February 2018 - 05:55:43 PM


లేడీ సూపర్ స్టార్ అనుష్క మరో అరుదైన రికార్డుని కైవసం చేసుకుంది. తన తాజా చిత్రం ‘భాగమతి’ తో మిలియన్ డాలర్ క్లబ్లో చోటు దక్కించుకుందామె. ఈరోజు ఆదివారంతో ‘భాగమతి’ సినిమా మిలియన్ డాలర్లను చేరుకుంది. దీంతో మొదటిసారి హీరోయిన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఒక సౌత్ ఇండియన్ సినిమా మిలియన్ డాలర్ మార్కును అందుకున్నట్లైంది.

దర్శకుడు జి. అశోక్, నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ కు కూడా ఇదే తొలి మిలియన్ డాలర్ మూవీ కావడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ చిత్రం ఇప్పటికే సుమారు రూ. 30 కోట్ల షేర్ ను కొల్లగొట్టి ఇప్పటికీ చాలా ఏరియాల్లో బలంగా నడుస్తోంది. ఈ వసూళ్ళన్కు ఇంకాస్త మైలేజ్ ఇచ్చేందుకు అనుష్క రేపటి నుండి తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల థియేటర్లకు వెళ్లి అభిమానులను కలిసి వారితో పాటే సినిమాను వీక్షించనున్నారు.