నవీన్ పోలిశెట్టితో సినిమాకు అనుష్క నో చెప్పినట్టేనా?

నవీన్ పోలిశెట్టితో సినిమాకు అనుష్క నో చెప్పినట్టేనా?

Published on Jul 15, 2021 2:38 AM IST


బాహుబలి సిరీస్‌తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తర్వాత అగ్రకథానాయిక అనుష్క శెట్టి మళ్ళీ ఇప్పటివరకు పెద్ద హిట్స్ అందుకోలేదు. అయితే వరుస సినిమాలు చేస్తూ కమర్షియల్‌ పంథాకు పోవాలన్న ఆలోచన లేకుండా, భిన్నమైన కథలను ఎంచుకునే పనిలో ఉన్న జేజమ్మ తన తదుపరి సినిమా విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే యూవీ క్రియేషన్స్‌ నిర్మాణంలో రూపొందనున్న ఓ ప్రేమకథా చిత్రంలో అనుష్క నటించనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ‘రా రా కృష్ణయ్య’ సినిమా దర్శకుడు మహేశ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని 25 ఏళ్ల యువకుడికి, 40 ఏళ్ల మహిళకు మధ్య సాగే ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని, ఈ సినిమాలో అనుష్క సరసన నవీన్‌ పోలిశెట్టి నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రం ఆగిపోయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం బరువు తగ్గాలని డైరెక్టర్ అనుష్కకు సూచించాడని, కానీ ఎంత ప్రయత్నించినా అనుష్క బరువు తగ్గడం లేదని, అంతేకాకుండా సినిమా చేసేందుకు కూడా అనుష్కకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదట. దీంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పేసిందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు