ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఘాటి’.. ఎప్పుడంటే..?

ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఘాటి’.. ఎప్పుడంటే..?

Published on Jun 2, 2025 3:52 PM IST

ghatti 1

స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి.

అయితే, ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుండటంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా, ఎట్టకేలకు ఈ చిత్రానికి సంబంధించి కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ‘ఘాటి’ చిత్రాన్ని జూలై 11న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ఓ సరికొత్త పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు.

దీంతో ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు అనుష్క ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి విద్యా సాగర్ సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

తాజా వార్తలు