సైలెన్స్’లో అనుష్క వైలెంటా ?

Published on Dec 3, 2018 5:28 pm IST

‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించిన అనుష్క.. ఆ తరువాత ఆమె ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. దాంతో ఆమె అభిమానులు ఆమె సినిమా ఎప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో కొంచం విరామం తీసుకుని అనుష్క ప్రస్తుతం తెలుగులో మాధవన్ తో కలిసి, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘సైలెన్స్’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ‘అరుంధతి, భాగమతి’ తరహా చిత్రాలు లాగానే ఈ చిత్రంలో కూడా అనుష్క పెర్ఫామెన్స్ నే హైలెట్ కానుందని చెబుతుంది చిత్రబృందం. పైగా అనుష్క ఈ సినిమాలో బాగా వైలెంట్ క్యారెక్టర్ లో నటిస్తోందట. మరి ఈ చిత్రం కూడా అనుష్క కెరీర్ లో మరో భారీ విజయంగా నిలిచిపోతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :