ప్రభాస్ కు జోడిగా మరోసారి అనుష్క ?
Published on Jun 8, 2017 1:38 pm IST


రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. ‘బాహుబలి-2’ తర్వాత ఆయన చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇన్ని అంచనాలున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయంపై కూడా ప్రేక్షకుల్లో బోలెడంత కుతూహలం ఉంది. అయితే ఆరంభం నుండి నినన్ మొన్నటి వరకు ఇందులో దక్షిణాది హీరోయిన్ ఎవరూ నటించరని కేవలం బాలీవుడ్ హీరోయిన్లకే అవకాశమని పలువురు టాప్ నటీమణుల పేర్లు వినిపించగా తాజాగా అనుష్క పేరు తెరపైకొచ్చింది.

బాలీవుడ్ సినీ వర్గాల వార్తల ప్రకారం ఈ సినిమాలో ముందుగా హిందీ హీరోయిన్లనే అనుకున్నా చివరికి అనుష్కనే ఫైనల్ చేసేలా ఉన్నారని, త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ వెలువడుతుందని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే ప్రభాస్ సరసన అనుష్క చేరికతో ‘సాహో’ సినిమాకు మరింత క్రేజ్ జతచేరడం ఖాయం. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు.

 
Like us on Facebook