సంక్రాంతికి ‘నిశ్శబ్దం’గా అనుష్క ?

Published on Aug 25, 2019 3:59 pm IST

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘సైలెన్స్’. తెలుగులో ఈ సినిమా ‘నిశ్శబ్దం’గా రానుంది. కాగా ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. కాగా ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపిస్తుండగా.. మాధవన్ సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు. వీరిద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట.

ఇక ఈ చిత్రంలో అనుష్క, మాధవన్ లతో పాటు సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అనుష్క.. మరి ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి. రచయిత కోన వెంకట్ తన బ్యానర్‌ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :