‘అరవింద సమేత’ తదుపరి షెడ్యూల్ వరంగల్ లో !

‘అరవింద సమేత’ తదుపరి షెడ్యూల్ వరంగల్ లో !

Published on Jul 5, 2018 2:05 PM IST

Ntr0
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న’అరవింద సమేత’ చిత్రం 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రానికి సంభంధించిన ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించడం కోసం తెలంగాణలోని కొన్ని లొకేషన్స్ ను సెలెక్ట్ చేసుకున్నాడట చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దాంట్లో భాగంగా ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ కోసం వరంగల్ వెళ్ళనుందట చిత్ర యూనిట్.

పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఉండబోతున్న ఈ చిత్రంలో తారక్ సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపించనున్నారు.

తాజా వార్తలు