నైజాం ఏరియాలో ‘అర్జున్ రెడ్డి’ కలెక్షన్లు !


ప్రస్తుతం ప్రతి సినీ ప్రేక్షకుడు మాట్లాడుకుంటున్న విషయం ‘అర్జున్ రెడ్డి’. విడుదలకు ముందు వేసిన ప్రీమియర్ల ద్వారానే బ్రహ్మాండమైన పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆ తరవాతి రోజుల్లో బాక్సాఫీస్ ను షేక్ చేసేసింది. ముఖ్యంగా యువత చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. విజయ్ నటనకు, సందీప్ వంగ దర్శకత్వ ప్రతిభను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చాల మంది సినీ సెలబ్రిటీలు సైతం చిత్రాన్ని, టీమ్ ను ఆకాశానికెత్తేస్తున్నారు.

కలెక్షన్ల విషయానికొస్తే యూఎస్ లో ఇప్పటికే మిలియన్ మార్క్ ను తాకిన ఈ సినిమా నైజాం ఏరియాలో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు రూ. 1.41కోట్లు రాబట్టిన ఈ సినిమా 2వ రోజు రూ.1. 1 కోట్లు, 3వ రోజు రూ. 1.09 కోట్లు, 4వ రోజు రూ .86 లక్షలు కలిపి మొత్తంగా రూ.4.46 కోట్ల షేర్ ను కొల్లగొట్టింది. రాబోయే రోజుల్లో కూడా సినిమా ఇదే తరహా రన్ ను కొనసాగించే అవకాశముంది.