“కబీర్ సింగ్” తర్వాత “అర్జున్ రెడ్డి” క్రేజ్ పెరిగింది.!

Published on Jul 11, 2019 10:38 pm IST

అదేంటి “అర్జున్ రెడ్డి” సినిమా విడుదలై సెన్సషనల్ హిట్ గా మారడం వలనే కదా దాన్ని హిందీలో రీమేక్ చేశారు అని అనొచ్చు అది ఒకరకంగా వాస్తవమే అయినా “కబీర్ సింగ్” వల్ల అర్జున్ రెడ్డి సినిమాకు కూడా బాగానే ప్లస్ అయ్యింది.ఎందుకంటే ఈ సినిమా తెలుగులో ఎంత సంచలనం సృష్టించిందో బాలీవుడ్ లో కూడా అదే రేంజ్ లో భారీ హిట్ ను నమోదు చేసుకుంది.ఈ రెండు చిత్రాలకు అంత ఎక్కువ క్రేజ్ రావడానికి కారణం ఈ సినిమా ట్రైలర్స్ అని చెప్పాలి.ఈ చిత్రం రీమేక్ మరియు తెలుగు భాషల్లో విడుదల చేసిన టీజర్ల కన్నా ట్రైలర్లకే అద్భుత స్పందన వచ్చింది.అది కబీర్ సింగ్ ట్రైలర్ తర్వాత మన అర్జున్ రెడ్డి ట్రైలర్ కు మరింత పెరిగిపోయింది.

ఆ ట్రైలర్ విడుదల చేసినంత వరకు అర్జున్ రెడ్డి ట్రైలర్ టాలీవుడ్ లో అత్యధికంగా వీక్షించిన మూడవ ట్రైలర్ గా రికార్డులో ఉంది.కానీ కబీర్ సింగ్ తర్వాత ఒరిజినల్ వెర్షన్ అయినటువంటి “అర్జున్ రెడ్డి” ట్రైలర్ ను చూసేందుకు సినీ ప్రేక్షకులు రావడంతో ఇప్పుడు అర్జున్ రెడ్డి, బాహుబలి2 ట్రైలర్ తర్వాత 39 మిలియన్ వ్యూస్ తో 30 మిలియన్ వ్యూస్ తో మూడో స్థానంలో ఉన్న “వినయ విధేయ రామ” ట్రైలర్ కు అందనంత దూరంలో ఉంది.ఇక్కడే విశేషం ఏమిటంటే కబీర్ సింగ్ ట్రైలర్ విడుదల చేసే సమయానికి వినయ విధేయ రామ ట్రైలర్ కు అర్జున్ రెడ్డి ట్రైలర్ కు పెద్ద వ్యత్యాసం కూడా లేదు కానీ ఈ కొద్ది రోజుల్లోనే ఏకంగా 9 మిలియన్ వ్యూస్ రాబట్టిందంటే అది కబీర్ సింగ్ ఎఫెక్ట్ అనే చెప్పాలి.మొత్తానికి దర్శకుడు సందీప్ హవా అన్ని చోట్లా గట్టిగానే ఉంది.ప్రస్తుతం విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న “డియర్ కామ్రేడ్” జూలై 26న విడుదలకు సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :

X
More