అరవింద ఆడియో వేడుక లేనట్లే ?

Published on Sep 11, 2018 8:49 pm IST

ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల వేడుక ఈనెల 20న గ్రాండ్ గా జరుగనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్ర ఆడియో వేడుకను రద్దు చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మాత్రమే జరుపనున్నారట.

అక్టోబర్ మొదటి వారంలో ఈ వేడుకను గ్రాండ్ గా జరపడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ వేడుక తెలంగాణ లో జరుగుతుందా లేక ఆంధ్రప్రేదేశ్ లో జరుగుతుందో తెలియాల్సి వుంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. నాగ బాబు, జగపతి బాబు ,రావు రమేష్ , ఈషా రెబ్బ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :