ఎప్పటిలానే పవన్ మిస్.!

Published on Aug 14, 2020 7:05 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహిత దర్శకుడు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసిన చివరి చిత్రం “అజ్ఞ్యాతవాసి”. ఈ చిత్రంలో పవన్ ను ఉద్దేశించి “ఇతని చర్యలు ఊహాతీతం వర్మ” అని ఉంటుంది. అది పవన్ రియల్ లైఫ్ కు కూడా చాలా యాప్ట్ గా ఉంటుందని మరోసారి ప్రూవ్ అయ్యింది.

ఎంత మెగా బ్రదర్ అయినప్పటికీ పవన్ వారి ఫ్యామిలీ ఫంక్షన్స్ కు అటెండ్ అయిన సందర్భాలు కూడా చాలా అరుదుగానే ఉన్నాయి. ఇప్పుడు అలాగే మళ్లీ పవన్ వారి కుటుంబానికి చెందిన శుభకార్యంలో మిస్సయ్యారు. తన అన్నయ్య నాగేంద్ర బాబు కుమార్తె మెగా డాటర్ నిహారిక నిశ్చయ వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా కనిపించారు.

కానీ ఏ ఒక్క ఫ్రేమ్ లో కూడా పవన్ కనిపించలేదు. దీనితో ఇదంతా సరా మామూలే అని పవన్ అభిమానులు అభిప్రాయ పడుతూ “వకీల్ సాబ్” టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చాతుర్మాస్య దీక్ష చేస్తున్న పవన్ లైనప్ లో మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More