ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న `అశ్వ‌థ్థామ‌` !

Published on Jan 23, 2020 5:24 pm IST

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`. కాగా తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చేశారు. ట్రైలర్ మెయిన్ కంటెంట్ ను ఎలివేట్ చేస్తూ ఆసక్తికరంగా సాగింది. మెయిన్ గా ఆడపిల్లలకు సంబంధించిన ఏమోసనల్ అండ్ సప్సెన్స్ ట్రాక్ తో పాటు.. యాక్షన్, లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ కూడా బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమా అంచనాలను పెంచేసింది. ఇక సమంత ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అత్యంత గ్రిప్పింగ్ గా ఉన్న ఈ టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా పూర్తి చేసుకుంటుంది. కాగా నిర్మాత ఉషా ముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఈ సినిమాలో సందర్భానుసారం మంచి యాక్షన్ సీక్వెన్స్ స్ ఉన్నాయట. మొదటిసారి ఈ చిత్రంలో నాగ‌శౌర్య సరసన హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుంది. పోసాని కృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీ‌చ‌ర‌ణ్‌, కెమెరా మ‌నోజ్‌ రెడ్డి, ఎడిట‌ర్‌ గారీ బిహెచ్‌, డైరెక్ష‌న్ ర‌మ‌ణ్‌ తేజ‌.

థియేట్రికల్ ట్రైలర్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

X
More