బాబు బయలుదేరినాడు అంటున్న అశ్విన్ !

నాన్న నేను బాయ్ ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన భాస్కర్ బండి తన రెండో సినిమాకు సంభందించి బిజీగా ఉన్నాడు. తాజా సమాచారం మేరకు ఈ డైరెక్టర్ ఓంకార్ తమ్ముడితో సినిమా చేస్తున్నట్లు సమాచారం. బాబు బయలుదేరినాడు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజి లో ఉంది.

అశ్విన్ గతంలో జత కలిసే, రాజుగారి గది, నాన్న నేను బాయ్ ఫ్రెండ్ సినిమాల్లో నటించాడు. రాజుగారి గది సినిమాలో అశ్విన్ చేసిన డాన్స్ కు మంచి పేరు వచ్చింది. బాబు బయలుదేరినాడు సినిమాకు సంభందించిన మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి. డైరెక్టర్ భాస్కర్ బండి గతంలో టాప్డైరెక్టర్ వినాయక్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చెయ్యడం జరిగింది.