ఆస్కార్ పై కన్నేసిన అట్లీ.. అతిగా లేదా?

ఆస్కార్ పై కన్నేసిన అట్లీ.. అతిగా లేదా?

Published on Oct 6, 2026 7:00 AM IST

కోలీవుడ్ యంగ్ అండ్ స్టార్ దర్శకుల్లో అట్లీ కూడా ఒకడు. కమర్షియల్ సినిమాల ఫార్మాట్ లో ఒక ముద్ర వేసుకున్న అట్లీ ఒక్క ప్లాప్ కూడా చూడలేదు. అయితే అంత మాత్రాన తను ఆస్కార్ లెవెల్ దర్శకుడా అంటే ఖచ్చితంగా కాదనే అంతా అంటారు. కానీ లేటెస్ట్ గా అట్లీ జారీ చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి.

తన రానున్న రాకా తో నేరుగా ఆస్కార్ అవార్డ్ పైనే కన్నేసినట్లు చెప్పుకొచ్చాడు. దీనితో ఈ స్టేట్మెంట్ కొంచెం అతిగా ఉందని కొందరు భావిస్తున్నారు. అట్లీ ఎంతో నమ్మకంగా చెప్పినప్పటికీ తన గత వర్క్స్ కూడా ఓహో ఈ దర్శకుడు ఆస్కార్ రేంజ్ పోటెన్షియల్ ఉన్న దర్శకుడు అనే తరహా సినిమా చేసిన ట్రాక్ రికార్డ్ లేదు.

పైగా శంకర్ స్టైల్ లోనే సినిమాలు చేస్తాడని కాన్సెప్ట్ లు పరంగా కూడా ఓ టాక్ ఉంది. సో అట్లీ నుంచి ఒక క్రేజీ ఆస్కార్ లెవెల్ ప్రొడక్ట్ లేకుండా ఇప్పుడు డైరెక్ట్ గా నా టార్గెట్ ఆస్కార్ అంటే ఎవరికైనా అతి గానే అనిపిస్తుంది. మరి నిజంగానే రాకా లో అంత మేటర్ ఉందా లేక చాలామంది ఇచ్చిన బిగ్ స్టేట్మెంట్స్ లానే ఇది కూడా బెడిసి కొడుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.

తాజా వార్తలు