‘బాలయ్య’ సినిమాలో విజయశాంతి.. నిజమేనా ?

‘బాలయ్య’ సినిమాలో విజయశాంతి.. నిజమేనా ?

Published on Oct 5, 2026 7:01 PM IST

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్రెడీ మొదలైంది. ఐతే, ఈ సినిమా అప్ డేట్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో ఆమె పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తోందట. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించి లీకుల రూపంలో చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

ఇక కొరటాల శివ సినిమా అనగానే.. కథ కంటే కూడా కథా నేపథ్యమే ఎక్కువగా గుర్తుకొస్తోంది. ఇప్పటివరకు ఆయన తీసిన ప్రతి సినిమాలో బలమైన నేపథ్యం ఉంది. కాగా నేపథ్యం చుట్టూ.. ఆ ప్రాంతపు జీవన శైలిని సైతం కొరటాల, తన సినిమాలో చాలా బలంగా చూపిస్తారు. మరి ఇప్పుడు బాలయ్య బాబుతో చేస్తున్న సినిమా నేపథ్యం ఏమిటో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు