స్పెషల్ సాంగ్ కోసం మెగాస్టార్ సరికొత్త లుక్ ?

స్పెషల్ సాంగ్ కోసం మెగాస్టార్ సరికొత్త లుక్ ?

Published on Oct 5, 2026 4:04 PM IST

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో కాకా సినిమా రాబోతుంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా అప్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, లేటెస్ట్ కథనాల ప్రకారం, ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ లో మెగాస్టార్ స్టైలిష్ లుక్‌ లో కనిపిస్తారని, ఈ లుక్ ను లాక్ చేశారని, కచ్చితంగా ఈ సాంగ్ తో మెగాస్టార్ ఫ్యాన్స్‌లో అంచనాలు మరింత పెరుగుతాయని తెలుస్తోంది. పైగా ఈ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ కూడా కనిపిస్తోందని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు రెండు వేర్వేరు పాత్రల్లో కనిపిస్తారని.. అందులో ఒక పాత్ర లుక్ చాలా యంగ్ గా ఉంటుందని.. అలాగే మునుపెన్నడూ చూడని మెగాస్టార్ ను ఈ పాత్రలో చూస్తాం అని తెలుస్తోంది.

పైగా ఈ సినిమాలో మెగాస్టార్ పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయట. అలాగే, ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

తాజా వార్తలు