మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో వస్తున్న భారీ చిత్రం ‘కాకా’ నుంచి కీలకమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్‌మేకర్, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. దర్శకుడు బాబీ కొల్లి సీన్ వివరిస్తుండగా అనురాగ్ కశ్యప్ శ్రద్ధగా వింటున్న వర్కింగ్ స్టిల్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ప్రస్తుతం ‘కాకా’ షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా సాగుతోంది. అనురాగ్ కశ్యప్ సెట్స్‌లోకి అడుగుపెట్టి ఇతర ప్రధాన నటీనటులతో కలిసి చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కాంబో రిపీట్ అవుతుండటంతో ప్రాజెక్ట్‌పై ఇప్పటికే పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో చిరంజీవి రెండు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచారు.
హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్
ఈ సినిమాలో అనస్వర రాజన్ ‘అమ్ములు పాప’ అనే ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో ఆమెను చిత్ర బృందం ‘హార్ట్ ఆఫ్ కాకా’గా పరిచయం చేసింది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బలమైన సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తోంది. తమన్ సంగీతం సమకూరుస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే రాయగా, భాను–నందు సంభాషణలు రాస్తున్నారు. ఎడిటర్‌గా ఆంటోని ఎల్. రూబెన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు.
ఈ హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌ను 2027 సంక్రాంతి బరిలో జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.


