కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిగా ఇంటర్నేషనల్ లెవెల్ హంగులతో తెరకెక్కుతున్న ఆ చిత్రమే ‘రాకా’. మంచి హైప్ ఉన్న ఈ సినిమా షూటింగ్ పూర్తిగా ముంబై లోనే జరుగుతుంది.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో మొదటి నుంచీ అభిమానుల్లో ఉన్న ఒకే ఒక్క డౌట్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా విడుదల ఎప్పుడు అని? అభిమానులే ఫన్నీగా ఈ సినిమా టీజర్ ఓ సంవత్సరంలో, ట్రైలర్ ఓ సంవత్సరంలో, ఆఖరికి సినిమా మరో సంవత్సరంలో విడుదల చేస్తారని ఫన్ చేసుకున్నారు. సో ఆ రేంజ్ లో ఈ సినిమా విడుదల ఎప్పుడు అనే సస్పెన్స్ నెలకొంది.
ఇక ఫైనల్ గా అట్లీ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చాడు. తనని ఈ సినిమా విడుదల ఎప్పుడు అని నిర్మాతే తనని అడగలేదు కానీ కానీ రిలీజ్ పై ఓ క్లారిటీ మాత్రం అతి త్వరలోనే ఇస్తాం అని అట్లీ హామీ ఇచ్చాడు. సో రాకా విషయంలో అభిమానుల్లో ఉన్న లాంగ్ అవైటెడ్ డౌట్ త్వరలోనే తీరనుంది అని చెప్పొచ్చు.


