నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఐతే, ఈ సినిమా అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో ఆమె నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపిస్తోందట. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించి లీకుల రూపంలో చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
కాగా ఈ మూవీని భారీ సోషియో-ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో, మల్టిపుల్ టైమ్‌లైన్స్, పునర్జన్మలు, భారీ విఎఫ్ఎక్స్ వంటి అంశాలతో రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మోక్షజ్ఞను రొటీన్ మాస్ కథతో కాకుండా కొత్త కాన్సెప్ట్‌తో లాంచ్ చేయాలనే ఉద్దేశంతోనే వశిష్ఠను ఎంచుకున్నారనే టాక్ ఉంది. అదే నిజమైతే, “వశిష్ఠ కరెక్ట్ ఛాయిస్ అనుకోవాలేమో. ఏది ఏమైనా సినిమా ఫస్ట్ లుక్ లేదా టీజర్ వచ్చాకే ఈ సినిమా ఎలా ఉండబోతుందో స్పష్టమవుతుంది.


