RRR, ‘బాహుబలి’లలో కూడా లేనిది ‘వారణాసి’లోనే.. కార్తికేయ కామెంట్స్ తో మరింత ఎగ్జైట్మెంట్!

RRR, ‘బాహుబలి’లలో కూడా లేనిది ‘వారణాసి’లోనే.. కార్తికేయ కామెంట్స్ తో మరింత ఎగ్జైట్మెంట్!

Published on Oct 4, 2026 4:04 PM IST

ఇప్పుడు భారతీయ సినిమా ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెస్తున్న భారీ సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేసిన భారీ సినిమా ‘వారణాసి’ కూడా ఒకటి. ఎన్నో అంచనాలు సొంతం చేసుకున్న ఈ సినిమా విజువల్ గా ఓ బిగ్ ట్రీట్ గా ప్లాన్ చేస్తున్నారు.

అయితే విజువల్స్, గ్రాండియర్ పరంగా ప్రిపేర్ అయ్యి ఉన్న ఫ్యాన్స్, ఆడియెన్స్ కి నిర్మాత ఎస్ ఎస్ కార్తికేయ మాత్రం మరో బిగ్ ప్రామిస్ ని చేస్తున్నాడు. ‘వారణాసి’లో యాక్షన్ పార్ట్ మాత్రం మరో లెవెల్ అంటున్నాడు. ‘వెరైటీ’కి ఇంటర్వ్యూ ఇచ్చిన కార్తికేయ వారణాసి లో యాక్షన్ పార్ట్ మాత్రం ప్రతీ ఒక్కరినీ సీట్ అంచున కూర్చోబెట్టేలా ఉంటుంది అని ప్రామిస్ చేస్తున్నాడు.

అంతే కాకుండా గత సినిమాలు RRR, బాహుబలి సినిమాల్లో కూడా లేని రేంజ్ యాక్షన్ పార్ట్ వారణాసి కోసం ట్రై చేసినట్టు తెలిపాడు. నిజానికి ఆ రెండు సినిమాల్లో యాక్షన్ పార్ట్ నే ఒకదాన్ని మించి ఒకటి ఎంతో ఇంటెన్సిటీ కలిగి ఉంటాయి. అలాంటిది వాటిని మించి వారణాసి కి అంటే ఖచ్చితంగా ఎగ్జైట్ అవ్వాల్సిన అంశమే.. సో యాక్షన్ పార్ట్ పరంగా వారణాసి ఎలాంటి ట్రీట్ అందిస్తుందో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు